దేశ ప్రజలకు ఆర్ఆర్ఆర్ టీం కరోనా మెసేజ్….

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ట్రిపుల్ ఆర్’. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయాన్ని కరోనా బాధితులకు సహాయం చేయడానికి కేటాయించారు దర్శకుడు రాజమౌళి టీం. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి కావలసిన అవసరాలను తీర్చడంతో పాటు వారు ఎక్కడ నుండి తమకు కావాల్సిన వాటిని తీసుకోవచ్చు అనేదాన్ని తమ సోషల్ మీడియా అక్కౌంట్స్ ద్వారా తెలియచేస్తున్నారు.
అయితే ఈరోజు పరిస్థితి తీవ్రతను గుర్తించిన రాజమౌళి తన హీరోలు ఎన్టీయార్, రామ్ చరణ్, అజయ్ దేవ్ గన్, హీరోయిన్ అలియా భట్ లతో ఓ చక్కని సందేశాన్ని పంపారు. అదేమంటే… అన్ని సమయాల్లోనూ మాస్క్ ను ధరించమని, వ్యాక్సినేషన్ ఎప్పుడు లభిస్తే అప్పుడు వేసుకోవాలని, భౌతిక దూరం పాటించమని హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో వీరితో చెప్పించారు. అంతేకాకుండా తానూ స్వయంగా ఈ సందేశాన్ని జనాలకు అందించారు. భారత దేశంలో కరోనా వ్యాపించకుండా ఉండటానికి అందరం కలిసి కట్టుగా ఉందామని రాజమౌళి బృందం వెల్లడించింది. రాజమౌళి, ఎన్టీయార్, రామ్ చరణ్, అజయ్ దేవ్ గన్ వివిధ భాషాల్లో తమ సందేశాన్ని వినిపించగా, అలియా భట్ తెలుగులో చెప్పడం విశేషం. కాగా మరి ఈ స్టార్స్ అభిమానులంతా ఈ నియమాలను పాటించి కరోనా బారిన పడకుండా ఉండాలని కోరుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *