దుబ్బాక భయంతోనే జిల్లాలకు కేసీఆర్ : రఘునందన్ రావు

తెలంగాణ సీఎం కేసీఆర్ పై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. బీజేపీని తిట్టడానికి అధికార వేదికలు వాడుకోవద్దని సూచించిన రఘనందన్… కేసీఆర్ భాషను నియంత్రించుకోవాలని అన్నారు. అలాగే యాక్షన్ కు రియాక్షన్ కూడా వస్తోందని సీఎం కేసీఆర్ అది గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి సంస్కారహీనంగా మాట్లాడటం తెలంగాణ సమాజానికి సిగ్గుచేటని.. దుబ్బాక భయంతోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలకు బయలు దేరారని ఎద్దేవా చేశారు. ఈ గజ్వేల్ ఎమ్మెల్యేను దుబ్బాక ఎమ్మెల్యే కూడా తిట్టగలడని రఘునందన్ చురకలు అంటించారు. తమ పీఠాలు కదులుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్పష్టంగా అర్థమైందని అందుకే ఇలాంటి పర్యటనల బాట పట్టారని వెల్లడించారు.
అదేవిధంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకొస్తే నీటి పంపకాలను తేల్చటానికి కేంద్రం సిద్ధమని అన్నారు. ఇంకా ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రైతు వేదికలు నిర్మించారని… రైతు వేదికలను ఏ ఒక్కరూ విమర్శించలేదని తెలిపారు. అంతేకాకుండా రైతు వేదికల్లో కేంద్రం వాటా, రాష్ట్రం వాటా ఎంత? అని ప్రశ్నించిన రఘునందన్ రావు.. కేంద్రం నిధులతో వైకుంఠదామాల నిర్మాణాలు చేపట్టారని.. హరిత హారం కింద ఖర్చు చేసే ప్రతిపైసా కేంద్రం ఇచ్చిందేనని స్పష్టం చేశారు. కాగా ఆ చేసిన పనులకు బిల్లులు రాక సర్పంచ్ లు ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఉందని.. అసలు రైతు బంధుని ఎవరూ వ్యతిరేకించలేదని రఘునందన్ రావు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *