దిశా యాప్ ఉండగా…. మీకు చింత ఎందుకు దండగా…!
ఆంధ్రప్రదేశ్ లో మహళల రక్షణ కోసం సీఎం జగన్ దిశ యాప్ ను తెచ్చిన విషయం తెలిసిందే. అయితే మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం దిశా చట్టాన్ని అయితే తెచ్చింది కానీ… అందుకు తగిన ప్రచారం రాలేదు. దీంతో ఇప్పుడు ప్రభుత్వం దిశాయాప్ను రూపోందించింది. ఈ యాప్ ప్రచార కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. కృష్ణాజిల్లాలోని గొల్లపూడిలో దిశాయాప్ ప్రచార కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. ప్రభుత్వం రూపొందించిన ఈ యాప్ నాలుగు అవార్డులు గెలుచుకుందని, ప్రతి మహిళ దిశాయాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని జగన్ కోరారు.
అదేవిధంగా దిశాయాప్పై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని జగన్ తెలిపారు. అలాగే వాలంటీర్ల ద్వారా మహిళలకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ వద్ద జరిగిన ఘటన తనను చాలా తీవ్రంగా కలిచివేసిందని, అందుకు ఈ యాప్ మహిళల మొబైల్ ఫోన్లలో ఉంటే మీ అన్న తోడుగా ఉన్నట్టే అని సీఎం వైఎస్ జగన్ పేర్కొనడం విశేషం. కాగా 2020 ఫిబ్రవరిలో దిశాయాప్ను అందుబాటులోకి తీసుకురాగా, ఇప్పటి వరకు దాదాపు 17 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్న వారిలో ఉన్నారు.