దిగొచ్చిన ట్విట్టర్…. పోలీస్ స్టేషన్ కు పరుగు….
ఇండియాలో ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఓ రకమైన యుద్ధమే జరుగుతుంది. కొత్త ఐటీ చట్టాలను ట్విట్టర్ అంగీకరించకపోవడంతో కేంద్రం నోటీసులు జారీ చేసింది. అయితే ఓ వీడియో కేసులో ట్విట్టర్‌పై యూపీలో కేసులు నమోదైన విషయం తెలిసిదే. యూపీకి చెందిన ఓ వ్యక్తి తనను కొంతమంది కొట్టారని చెప్పి వీడియోను తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోను కొంత మంది నేతలు షేర్, లైక్ లు కొట్టడంతో ట్విట్టరపై కేసులు నమోదయ్యాయి. తాయత్తులు అమ్ముతూ జీవనం సాగించే వ్యక్తి కొంతమందికి తాయత్తులు అమ్మారని, అవి పనిచేయకపోవడంతో కొందమంది వ్యక్తులు తాయత్తులు అమ్మిన వ్యక్తిపై దాడులు చేశారని, దాడి చేసిన వారిలో ముస్లింలు కూడా ఉన్నారని, పోలీసులు చెప్తున్నారు.
అదేవిధంగా మతపరమైన అల్లర్లకు ఇలాంటి వీడియోలు కారణం అవుతున్నాయని పోలీసులు వెల్లడిస్తున్నారు. కానీ.. ట్విట్టర్ పై కేసులు పెట్టడానికి కారణం 500వరకు అకౌంట్లను విత్‌హెల్డ్‌లో పెట్టడమే. విత్‌హెల్డ్ లో పెట్టిన మెసేజ్‌లు, వీడియోలు ఇండియాలో కనిపించవు. కానీ.. బయట దేశాల్లో కనిపిస్తాయి. అంతేకాకుండా ట్విట్టర్ ఇండియా హెడ్‌ను ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వాగ్మూలం ఇవ్వాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాగ్మూలం ఇస్తానని ట్విట్టర్ ఇండియా హెడ్ చెప్పినప్పటికీ.. అందుకు పోలీసులు ఎంతమాత్రం అంగీకరించలేదు. దీంతో గురువారం రోజున ట్విట్టర్ ఇండియా హెడ్ మనీష్ మహేశ్వరీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వాగ్మూలం ఇవ్వనున్నట్లు ఒప్పుకున్నారు. మొత్తానికి ఇండియాలో ట్విట్టర్ దిగిరావడం సంచలనంగా మారింది.