దండకారణ్యంలో పలువురు అగ్రమావోలకు కరోనా…
కరోనా అడవిలో ఉంటున్న అన్నలను కూడా వదలడం లేదు. దండకారణ్యంలో మావోయిస్టులకు కరోనా టెన్షన్ పెడుతోంది. అడవుల్లో మావోయిస్టు అగ్రనేతలు కరోనాతో బాధపడుతున్నారు. మావోయిస్టులలో కీలక నేతలు కరోనా పాజిటివ్తో పోరాడుతున్నారు. దీంతో ఈ కరోనా పంజాతో ప్రస్తుతం మావోలు అడవుల్లో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అగ్రనేతలు కరోనా బారినపడిన చికిత్సకు అనుమతించట్లేదు మావోయిస్టు పార్టీ. కాగా లొంగిపోతే చికిత్స చేయిస్తామంటున్నారు పోలీసులు. కాగా ఈ మధ్య మధుకర్ మృతితో సీనియర్లలో ఆందోళన పట్టుకుంది. మధుకర్ తో పాటు 12 మంది సీనియర్ నాయకులకు కరోనా సోకినట్లు సమచారం అందుతుంది. వీరందరికి రహస్యంగా మావోయిస్టు పార్టీ చికిత్స చేయిస్తోంది. కాల్పుల విరమణపై పార్టీలో చర్చ మొదలైనట్లు సమాచారం.
అయితే కరోనా బారిన పడ్డ అగ్ర మావోయిష్టులు వరుసగా….
కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్
తిప్పరి తిరుతి ఆలియాస్ దేవుజీ
యాప నారాయణ అలియాస్ హరిభూషణ్
బడే చొక్కారావు అలియాస్ దామోదర్
కటకం రాజిరెడ్డి అలియాస్ ధర్మన్న
కట్టా రాంచందర్ రెడ్డి అలియాస్ వికల్స్
ములా దేవేందర్ రెడ్డి అలియాస్ మాస దడ
కున్కటి వెంకటయ్య అలియాస్ వికాస్
ముచ్చకి ఉజల్ అలి యాస్ రఘు
కొడి మంజుల అలియాస్ నిర్మల
పూసం పద్మ
కాకర్ల సునీత అలియాస్ బుర్రా తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది.