తెల్లటి గౌనులో తలపురేపుతోన్న నిత్యా
టాలీవుడ్ లో చిట్టిపొట్టి మాటలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నిత్యామీనన్. నిజానికి నిత్యాకు సూపర్ టాలెంటెడ్ హీరోయిన్ గా పేరుంది. ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, జనతా గ్యారేజ్, సన్నాఫ్ సత్యమూర్తి వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా నిత్యా వల్ల ఆ సినిమాలకే మంచి క్రేజ్ వచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయా సినిమాలలో నటించడమే కాకుండా ఆయా పాత్రలలో జీవించి ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.
కాగా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసే ముగ్ధమోహన సౌందర్యం నిత్యా సొంతం. తగిన పాత్రోచిత నటన పండించి మంచి గుర్తింపు తెచ్చుకుంది కూడా. తాజాగా పెళ్లి గెటప్లో దర్శనమిచ్చింది నిత్యామీనన్. తెల్లగా మెరిసిపోతున్న పెళ్లి గౌను ధరించి ఆమె ఫొటోలకు పోజిచ్చింది. బొద్దుగా ఉన్న నిత్యా మీనన్ సన్నగా మారి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే నిత్యా ప్రస్తుతం పలు తమిళ, తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.