తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న కరోనా…..
తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకీ విపరీతంగా విబృంభిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం కొత్తగా 518 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,05,309 కి చేరింది. ఇందులో 2,99,631 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,994 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1,683 కి చేరింది.
అయితే ఆంధ్రపదేశ్ లో కూడా కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. నిన్నటి రోజున 700లకు పైగా కేసులు నమోదయ్యాయి. గతంలో మాదిరిగానే తూర్పు గోదావరి జిల్లాలోని తొండంగి మండలంలోని ఓ కుటుంబంలో 21 మందికి కరోనా సోకింది. రాజమండ్రిలోని తిరుమల కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్ధి ఈ మధ్యే ఇంటికి వెళ్లాడు. అలా ఇంటికి వెళ్లిన విద్యార్ధికి కరోనా సోకింది. ఆ విద్యార్ధి నుంచి మిగతా కుటుంబ సభ్యులకు కరోనా సోకినట్టు అధికారులు చెప్తున్నారు. కాగా ప్రస్తుతం అధికారులు ఆ కుటుంబసభ్యులకు చికిత్స అందిస్తున్నారు.
అదేవిధంగా ఇండియా మొత్తంగా చూసుకుంటే కరోనా కేసులు గడచిన 24 గంటల్లో కొత్తగా 59,118 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,18,46,652కి చేరింది. ఇందులో 1,12,64,637 మంది కోలుకోగా, 4,21,066 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. అలాగే గడిచిన 24 గంటల్లో ఇండియాలో 257 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 1,60,949 కి చేరింది. కాగా ఇండియాలో ఇప్పటి వరకు మొత్తం 5,55,04,440 మందికి కరోనా టీకా అందించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.