తెలంగాణ ప్రజలకు నీళ్ల గోస తీరింది : హరీష్ రావు

ప్రత్యేక తెలంగాణ సాకారం చేసుకోవడంతో రైతుల కళ్ళలో నేడు ఆనందం కనిపిస్తుంది అని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇదే కాంగ్రెస్ వాళ్లు, బీజేపీ వాళ్ళు ఉంటే నీళ్లు వస్తాయా? అని ఆయన ప్రశ్నించారు. అలాగే మన పనితనంతోనే ప్రతిపక్షాలకు సమాధానం చెప్పామని, నీళ్లు ఇచ్చామని, ఇంకా 100 మీటర్ల ఎత్తు నుండి 600 మీటర్లలో ఉన్న కూడవెళ్లి వాగుకు నీటిని అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని ఆయన అన్నారు.
అదేవిధంగా గతంలో ఎమ్మెల్యేలు రావాలంటే ముందు పోలీసు వాహనాలు కానీ బోర్ మోటారు కానీ వచ్చేది, ఇప్పడు ఆ పరిస్థితి లేదని, నీళ్లు వచ్చేటందుకు కృషి చేసిన ఇంజనీర్లకు, భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా కాంగ్రెస్ వాళ్లు ఉండగా కాలిపోయిన బోర్లు, పేలిపోయిన మీటర్లు ఉండేవని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలిపారు. ఇంకా సజీవంగా ఈ గోదారమ్మ గజ్వెల్ నియోజకవర్గం అంతా పారుతుంది. గత ప్రభుత్వాల హయాంలో కరెంట్ కోసం,ఎరువుల కోసం, వర్షం కోసం ఎదురుచూపులే ఉండేవని ఇప్పుడు ఆ కష్టాలు పోయాయని వివరించారు. ఆరు దశాబ్దాల సమయంలో కానీ పనులను 6 సంవత్సరాల సమయంలో సహకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని హరీష్ రావు వివరించారు. దీంతో ఇక తెలంగాణలో ప్రజలకు నీళ్ళ గోస లేదని హరీష్ రావు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *