తెలంగాణలో సెకండ్ ఇయర్ ఇంటర్ పరీక్షలు రద్దు…
దేశంలో కరోనా ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తుంది. దీంతో కరోనా ఉధృతంగా ఉండటంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల పరీక్షలను రద్దు చేసుకుంటూ వస్తున్నాయి. అయితే కరోనా ఉదృతి నేసథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పదవ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను రద్ధు చేసిన ప్రభుత్వం ఇప్పుడు సెకండ్ ఇయర్ పరీక్షలను కూడా రద్ధు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
అదేవిధంగా ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తే మరలా కేసులు విజృంభించే అవకాశం ఉంటుందని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా సెకండ్ వేవ్లో యువత ఎక్కువగా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రస్తుతం చూసుకుంటే.. థర్ఢ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందనే టాక్, పిల్లలకు కరోనా సోకుతుందనే వదంతులు వ్యాపిస్తున్నాయి. దీంతో ఈ సమయంలో ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం విశేషం.