తెలంగాణలో లాక్ డౌన్ పై ఈటల క్లారిటీ…
తెలంగాణలో విపరీతంగా కరోనా కేసులు నమోదౌతున్నాయి. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఫస్ట్ వేవ్ కంటే వేగంగా సెకండ్ వేవ్ లో కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలో తిరిగి మళ్లీ తెలంగాణలో లాక్ డౌన్ విధించనున్నారనే టాక్ విపరీతంగా వినిపిస్తుంది.
అయితే ఈ విషయంలో తాజాగా మంత్రి ఈటల స్పందించారు. కరీంనగర్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఈటల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 సంవత్సరాల పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాటు చేయమని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కోరడం జరిగిందని.. వారు సానుకూలంగా స్పందించారు కానీ హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో ఆక్సిజన్ కొరత ఉన్న మాట వాస్తవమే అని, ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. సెకండ్ వేవ్ కరోనా గతంలో కంటే వేగంగా విస్తరిస్తోందని హెచ్చరించిన ఆయన.. ప్రభుత్వం ఇచ్చిన సూచనలు తూచా తప్పకుండా పాటిస్తూ వరి ధాన్యం కొనుగోలులో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని కోరారు.
కాగా హైదరాబాదులో వ్యాక్సిన్ తయారవుతుంది కాబట్టి తెలంగాణకు మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ వ్యాక్సిన్ కేటాయించడంలో ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరినట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణలో కర్ఫ్యూ 144 సెక్షన్ లాక్ డౌన్ విధించే ఆస్కారం ఉండదని.. ప్రజలే అవసరం ఉంటే తప్ప బయటికి రాకూడదని తెలిపారు. అలాగే దేశంలో రెండు లక్షల కేసులు నమోదు అవుతున్నాయని… మన తెలంగాణలో నాలుగు వేల కేసులు నమోదవుతున్నాయని వివరించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా నీళ్లు అందించామని.. రైతాంగం క్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఈటల రాజేందర్ అన్నారు.