తెలంగాణలో రేపటి నుంచి కఠిన లాక్ డౌన్…
తెలంగాణలో రోజు రోజుకూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మృతుల సంఖ్య కూడా భారీగా నమోదవుతుంది. ఇలాంటి సమయంలో కెసిఆర్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రేపటి నుంచి లాక్ డౌన్ విధిస్తున్నట్లు కెసిఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అదేవిధంగా రేపటి నుంచి 10 రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగనుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే సిఎం కెసిఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఇందుకు సంబంధించి లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నారు. కఠినమైన లాక్ డౌన్ విధిస్తే తప్ప కరోనా కేసులు తగ్గే అవకాశాలు లేవని తెలుస్తోంది. నిత్యావసరాల రావాణా, మీడియా, హాస్పిటల్ కు తప్ప మిగతా అన్నీ లాక్ డౌన్ అమలు కానుంది. కాగా మారికొద్దిసేపట్లోనే లాక్ డౌన్ మార్గదర్శకాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే టీకా కొనుగోలు గ్లోబల్ టెండర్లను పిలవాలని కెబినెట్ నిర్ణయం తీసుకుంది.