తెలంగాణలో మరో నిరుద్యోగి మృతి.. వైఎస్ షర్మిల మండిపాటు…
తెలంగాణలో నిరుద్యోగానికి సంబంధించిన చావుల ఈ మధ్య కాలంలో ఎక్కువవుతున్నాయి. తాజాగా నల్గొండ జిల్లా చండూర్ మండలం పళ్ళెంలలో మరో నిరుద్యోగి ఆత్మహత్య పాల్పడ్డాడు. ఎలాంటి నోటిఫికేషన్లు వెలువడకపోవడంతో.. మనస్తాపానికి గురైన పాక శ్రీకాంత్ (25) అనే నిరుద్యోగి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతుంది.
అయితే ఈ ఘటనపై తెలంగాణలో కొత్తగా పార్టీ పెట్టాలని భావిస్తున్న వైఎస్ షర్మిల స్పందించారు. నిరుద్యోగులు ఎలాంటి అధైర్యానికి లోనుకావద్దని, ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేంతవరకు తాను ఎంతవరకైనా పోరాడుతానని ఆమె స్పష్టం చేశారు. అలాగే నిరుద్యోగ యువతకు తాను ఓ అక్కలా మిమ్మలను కోరేది ఒక్కటే. అదేమంటే… దయచేసి ఆత్మహత్యలకు పాల్పడవద్దు. రేపటి భవిష్యత్తు కోసం.. నేడు మార్పు తేవాల్సిందే. ఆ మార్పు కోసం మనం కలిసి పోరాడుదాం. అయ్యా కేసీఆర్ సారు, ‘కనీసం మీ పార్టీ పుట్టిన రోజైనా చస్తే మా నిరుద్యోగులను గుర్తిస్తారేమోనని నోటిఫికేషన్లు లేక మనస్థాపానికి గురై నల్గొండ నిరుద్యోగి శ్రీకాంత్ నిన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇకనైనా నిద్ర లేవండి. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వండి. నిరుద్యోగ హత్యలు ఆపండి’ అంటూ షర్మిల ప్రకటించారు. యువతకు తగిన భరోసా కల్పించారు.