తెలంగాణలో భారీగా మద్యం అమ్మకాలు..

తెలంగాణలో మద్యానికి విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఈరోజు నుంచి తెలంగాణలో లాక్డౌన్ అమలులోకి రావడంతో మద్యానికి భారీ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా పది రోజులపాటు లాక్డౌన్ అమలు కానున్న నేపథ్యంలో ఇక మద్యం దొరకదేమోనన్న ఆలోచనతో మద్యంప్రియులు ఒక్కసారిగా ఎగబడ్డారు. లాక్డౌన్ అన్న ప్రకటన తర్వాత తెలంగాణలో మద్యం కోసం మందుబాబులు వైన్ షాపుల ముందు క్యూలు కట్టారు.
అయితే మద్యం నిన్న ఒక్కరోజే తెలంగాణలో ఏకంగా రూ.125 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయంటే ఏ మోతాదులో మద్యం కొనుగోలు చేశారో అర్థమౌతుంది. లాక్డౌన్ మొదటిరోజు కూడా పెద్దసంఖ్యలో అమ్మకాలు జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కాగా ఈరోజు ఏకంగా రూ.94 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇదిలా ఉండగా.. ఈ నెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రూ. 770 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినట్లు అబ్కారీ శాఖ స్పష్టం చేయడం సంచలనంగా మారింది.