తమిళ తంబీల దెబ్బకి దిగొచ్చిన అమెజాన్ ప్రైమ్…
తాజాగా రాజ్, డికె రూపొందించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. మనోజ్ బాజ్పేయి, సమంతా అక్కినేని, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో రాజి అనే శ్రీలంకకు చెందిన తమిళియన్ పాత్రలో నటిస్తోంది సామ్. అయితే సామ్ ఇందులో సూసైడ్ బాంబర్ గా కన్పించింది. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ‘ఫ్యామిలీ మ్యాన్-2 ఎగైనెస్ట్ తమిళ్’ అనే హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
అయితే తమిళుల కోసం పోరాడిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలంకి ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థతో లింకులు ఉన్నట్లు ట్రైలర్ లో చూపించారు. ముఖ్యంగా శ్రీలంకలో తమిళ వాసుల కోసం పోరాడిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం సంస్థ అసలు టెర్రరిస్ట్ సంస్థ కాదని, సామ్ తమిళ నటి అయ్యి కూడా ఇలాంటి పాత్రలో నటించడం ఏంటి అంటూ మండిపడ్డారు తమిళులు. దీంతో దిగొచ్చిన అమెజాన్ ప్రైమ్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ ట్రైలర్ను ఎడిట్ చేసి విడుదల చేసింది. కాగా జూన్ 4న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ విడుదల కానుంది. విడుదలకు ముందే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విశేషంగా చెప్పవచ్చు.