తన పొలిటికల్ ఎంట్రీ పై జూనియర్ ఎన్టీఆర్ రెస్పాండ్
తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎన్టీఆర్ తర్వాత అదే స్థాయి కలిగిన వెండితెర నటుడు జూనియర్ ఎన్టీఆర్. అయితే తాజాగా రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు జూనియర్ ఎన్టీఆర్. 2009 ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత రాజకీయాలపై అంతగా ఆసక్తి కనబరచలేదు. ముఖ్యంగా టీడీపీ డీలా పడిన ప్రతిసారీ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తెస్తుంటారు. ఇక జూనియర్ ఎన్టీఆరే పార్టీకి దిక్కు అని తెగ హడావుడి చేస్తుంటారు.
కాగా ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. జెమినీ టీవీ కోసం ఆయన ఎవరు మీలో కోటీశ్వరులు? అని ప్రోగ్రాం చేస్తున్నారు. ఆ ప్రోగ్రాంకు సంబంధించిన ప్రెస్ మీట్ ఈరోజు హైదరాబాద్ మాదాపూర్ లోని ఐటీసీ కోహినూర్ హోటల్ లో జరిగింది. ఈ సందర్భంగా కొంతమంది మీడియా మిత్రులతో ఎన్టీఆర్ ముచ్చటించారు. ఇదే సమయంలో మీరు మళ్ళీ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారు? అని ఒక విలేకరి ప్రశ్నించగా అందుకు ఎన్టీఆర్ ఆసక్తికరమైన సమాధానాన్ని వినిపించారు. అదేమంటే ఇది సమయం, సందర్భం కాదు, మనం తీరిగ్గా ఆ విషయాన్ని కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అంటూ దాటవేశారు. ఎన్నిసార్లు చెప్పినా అదే ప్రశ్న మళ్లీ మళ్లీ అడుగుతూనే ఉన్నారని ఎన్టీఆర్ సరదాగా కామెంట్ చేశారు.