తండ్రికి స్వయంగా క్షవరం చేసిన బండ్ల గణేష్…
కరోనా ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. దేశంలో ఎవరికి కరోనా ఉందో ఎక్కడ లేదో కూడా తెలియడం లేదు. దీంతో జనాలు బయటికి పోవడానికే ప్రయత్నిస్తున్నారు. వెళ్లినా చాలా భయంగా గడపాల్సిన పరిస్థితి. అయితే బండ్ల గణేశ్ మంచి నటుడు, నిర్మాతే కాదు… తల్లిదండ్రులంటే ఎంతో అభిమానం ఉన్న కొడుకు కూడా. కరోనా కారణంగా గత యేడాది చాలామంది గడ్డాలూ మీసాలు పెంచేశారు. కారణం ఏమిటంటే.. సెలూన్ కు వెళ్ళి కటింగ్ చేయించుకుంటే ఎక్కడ కరోనా సోకుతుందో అనే భయంతో గడ్డాలు, మీసారు పెంచేసుకుంటున్నారు.
అయితే…. కొందరు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో కత్తెర చేతపట్టి, ఇంట్లో అయిన వాళ్ళకు హెయిర్ కటింగ్ చేసుకోవడం, చేయించుకోవడం చేస్తున్నారు. తాజాగా ఇదే పని బండ్ల గణేశ్ కూడా చేశాడు. ‘కరోనా భయంతో మా నాన్నకి ఈరోజు మా షాద్ నగర్ ఇంట్లో నేనే కటింగ్ చేశాను’ అంటూ తన తండ్రికి జుత్తు కత్తిరిస్తున్న వీడియోను బండ్ల గణేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే… ఇంతవరకూ బాగానే ఉంది. కానీ.. బండ్ల గణేశ్ ఈ వీడియో ఇప్పుడు ఇంత అర్జెంట్ గా ఎందుకు పోస్ట్ చేసి ఉంటాడని కొందరు చాలా తీవ్రంగా ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే ఈ మధ్యనే తమిళంలో వచ్చిన ‘మండేలా’ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. అందులో హీరో బార్బర్. ఈ సినిమా హక్కులు తానే తీసుకుని, హీరో పాత్ర చేయాలని బండ్ల గణేశ్ భావించాడనే వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు దాని రైట్స్ వేరొకరు తీసుకుని సునీల్ తో తీయబోతున్నారని తెలుస్తోంది. వెండితెరపై బార్బర్ పాత్ర పోషించే ఛాన్స్ మిస్ చేసుకున్న బండ్ల గణేశ్ నిజ జీవితంలో అయినా కనీసం ఆ పని చేద్దామనుకున్నారని ఇలా చేసుంటారని సోషల్ మీడియాలో పోస్ట్ లు వైరల్ గా మారాయి.