ఢిల్లీ విమానాశ్రయంలో రాజమౌళి…. తీవ్ర అసంతృప్తి…!

ప్రముఖ దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తాజాగా ఢిల్లీ విమానాశ్రయం తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వెల్లడించడానికి ఆయన సోషల్ మీడియాను ఉపయోగించారు. ‘ఢిల్లీ విమానాశ్రయానికి లుఫ్తానాసా విమానంలో ఉదయం 1గంటలకు చేరుకున్నాను. అక్కడ ఆర్టీపిసిఆర్ పరీక్ష ఫామ్ నింపడానికి ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. అయితే కొంతమంది నిలబడి ఫామ్ ఫిల్ చేస్తుంటే, మరికొంత అందుకోసం గోడలను ఆసరా చేసుకున్నారు. దరఖాస్తు ఫామ్ లను నింపడానికి టేబుల్ సిస్టం ఉంటే బాగుంటుందని ఆయన తెలిపారు.
అంతేకాకుండా ఎగ్జిట్ గేట్ వెలుపల హ్యాంగర్లో చాలా కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని తెలిపిన ఆయన తొలిసారి భారతదేశాన్ని పర్యటించే విదేశీయులకు ఇది అంత మంచి భావాన్ని సూచించదని ట్వీట్ చేసి ఢిల్లీ విమానాశ్రయ అధికారుల తీరుపై అసంతృప్తిని వెల్లడించారు. అలాగే ప్రస్తుతం రాజమౌళి ట్వీట్ వైరల్ అవుతుండగా… చాలామంది ఆయన ట్వీట్ కు సపోర్ట్ చేస్తూ దాన్ని రీట్వీట్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఢిల్లీ ఎయిర్ పోర్టులో తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. కాగా రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. రెండు పాటలు షూటింగ్ కోసం పెండింగ్లో ఉన్నాయని యూనిట్ ఈ మధ్య తెలిపింది. సినిమా విడుదలపై ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *