ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో మరోసారి భారీస్థాయి డ్రగ్ పట్టివేత

ఈ మధ్య కాలంలో విమానాశ్రయాల్లో భారీగా మత్తుమందులు పట్టుబడుతుండటం విశేషం. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ వంటి విమానాశ్రయాల్లో వరుసగా కస్టమ్స్ అధికారులు భారీ స్థాయిలో డ్రగ్ ను పట్టుకుంటున్నారు.
తాజాగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీస్థాయిలో డ్రగ్స్ పట్టుబడింది. జోహన్నెస్బర్గ్ నుండి ఢిల్లీ వచ్చిన ఇద్దరు స్మగ్లర్ల వద్ద నుంచి 98 కోట్ల విలువ చేసే హెరాయిన్ ను పోలీసులు గుర్తించారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి 14 కేజీల డ్రగ్స్ ను తరలించే ప్రయత్నం చేశారు నిందితులు. డ్రగ్స్ ను లగేజ్ బ్యాగ్ లో దాచి గ్రీన్ చానెల్ ద్వారా బయటకు చెక్కేసే యత్నం చేశారు. అయితే పోలీసులకు అనుమానం రావడంతో ఇద్దరిని అడ్డగించారు కస్టమ్స్ అధికారులు. వారి లగేజ్ బ్యాగ్ ను స్కానింగ్ చేయగా డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టు బయట పడింది. ఈ కేసులో ఇద్దరిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు. కాగా పట్టుబడ్డ ఆ ఇద్దరు నిందితులు జాంబియా దేశస్థులని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *