డ్రంక్ అండ్ డ్రైవ్ లో చిక్కి… హైటెన్షన్ పై ఎక్కి…
తెలంగాణలోని హైదరాబాద్ లో ఈరోజు విచిత్ర ఘటన చోటు చేసుకుంది. మందు తాగిన మందు బాబు పోలీసులకు దొరికి పోయాడు. ఆ తర్వాత హైటెన్షన్ వైర్లపై ఎక్కి ఊగులాడుతూ పోలీసులకు హైటెన్షన్ రేకెత్తించాడు.
సహజంగా ఇప్పటివరకు మనం పోలీసులకు దొరికిన మందు బాబులు పారిపోవడం చూశాం. ఎదురు తిరగడం చూశాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి చేయి దాటింది. వాళ్లకు దొరకకుండా ఉండేందుకు విద్యుత్ తీగలపై ఎక్కి మత్తులో వేలాడిన ఘటన షాద్ నగర్ లో చోటుచేసుకుంది. అసలేం జరిగింది అంటే… మందు తాగి పోలీసులకు పట్టుబడటంతో పోలీసులు ఆ వ్యక్తి బైక్ను సీజ్ చేశారు. దీంతో వెంటనే అతడు హైటెన్షన్ వైర్లపైకి వెళ్లిపోయాడు. మెల్లిగా హైటెన్షన్ పోల్ పై నుంచి వైర్లపైకి పాకేశాడు.
అయితే ఆ సమయంలో కరెంట్ లేకపోవడంతో బ్రతికి పోయాడు. స్థానిక సీఐ వచ్చి ‘నీపై ఎలాంటి కేసు పెట్టం.. బైక్ ను కూడా సీజ్ చేయం’ అని చెప్పేంత వరకు కిందకి రాలేదు. ఆ వీడియోను స్థానిక రిపోర్టర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా అది ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది.