డోన్ట్ కేర్… నాతోనే నేను అంటోన్న రకుల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బోల్డ్ కామెంట్స్ చేయడంలో మంచి ఎక్స్ పర్ట్. తెలివిగా మాట్లాడటం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘చెక్’ సినిమా భారీ అంచనాలతో థియేటర్స్లో రిలీజై మంచి టాక్ తో దూసుకుపోతుంది.
చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టుకుంటుంది. అయితే తాజాగా ‘చెక్’ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాపై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. చెక్ సినిమా స్టోరీ తనకు బాగా నచ్చిందని, భిన్నమైన పాత్ర కావటంతో నటనలో ఇంట్రస్ట్ కనిపించిందని తెలిపింది. అలాగే తానెప్పుడూ ఆలోచించేది ఒక్కటేనని.. తన లాస్ట్ సినిమాకి, ప్రజెంట్ సినిమాకి కంపేర్ చేస్తే.. తన పర్ఫార్మెన్స్ మెరుగుగా కనపడితే చాలని చెప్పింది. తానెప్పుడూ ఆలోచించేది ఇదేనని.. అందుకే చెక్ చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ ఎవరేమనుకున్న డోన్డ్ కేర్.. నాతోనే నాకు పోటీ.. నేనెప్పుడూ నాతోటే ఉంటా’ అంటూ రకుల్ స్పష్టం చేసింది.
కాగ ఈ సినిమా తర్వాత తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనుంది. అందులో వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంతో వైవిధ్య భరితమైన పాత్రల్లో గ్రామీణ యువతీయువకుల వలె నటించింది. ఇప్పుడు ఆడియన్స్ ఓటీటీల్లో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చూస్తున్న విషయం తెలిసిందే. అందుకే నిత్యం డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తూ అలా దూసుకుపోతున్నారు హీరోయిన్స్ కూడా. అందులో భాగంగా రకుల్ భామ కూడా ఒకటే తరహా సినిమాలు కాకుండా.. ఆడియన్స్ బోర్ ఫీల్ కాని సినిమాలను తెరకెక్కించేందుకు నిరంతరం ట్రై చేస్తుంది అంట. ప్రస్తుతం హిందీలో నాలుగైదు సినిమాలు చేస్తున్నానంటూ కూడా రకుల్ భామ చెప్పుకోవడం విశేషం. మొత్తానికి రకుల్ భామ మంచి హుషారుగా వరుస సినమాలతో హీటెక్కించేస్తుందిగా.