డైరెక్టర్ రాజమౌళి కీలక నిర్ణయం….
టాలీవుడ్ దిగ్దర్శకుడు రాజమౌళి కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా షూటింగ్స్ ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా వేవ్ తగ్గడంతో మరికొద్ది రోజుల్లోనే షూటింగ్స్ పునఃప్రారంభం కానున్నాయి. సినీ అభిమానులు ఎక్కువగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా విషయంలో దర్శకధీరుడు రాజమౌళి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.
అదేమంటే… క్లైమాక్స్ సన్నివేశాలతో పాటు కీలక యాక్షన్ సీన్లకు సంబంధించిన షూటింగ్ మిగిలి ఉంది. అందుకు ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. దీంతో ముందుగా అనుకున్న డేట్కు ఆర్ఆర్ఆర్ను విడుదల చేయడం కుదరదని, మరోసారి విడుదల తేదీ మార్పుపై చర్చలు జరుగుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా వచ్చే ఏడాది 2022 ఏప్రిల్ 28న విడుదల చేస్తే బాగుంటుందని రాజమౌళి సూచించినట్లు సమచారం అందుతుంది. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి.