డైరెక్టర్ అవతారమెత్తిన బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే…
సౌత్ ఇండియన్ బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే బాలయ్య లెజండ్ తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆ తర్వాత ఆమె తెలుగు, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించి మంచి హాట్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా రాధికా ఆప్టే దర్శకత్వం చేసేందుకు రెడీ అయ్యారు. రాధికా హార్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘స్లీప్ వాకర్స్’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ‘స్లీప్వాకర్స్’లో షహానా గోస్వామి, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రలను పోషించడం విశేషం. పామ్స్ స్ప్రింగ్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో రాధికా తాను దర్శకత్వం వహించిన ‘ది స్లీప్వాకర్స్’ ట్రైలర్ను రిలీజ్ చేసింది.
అయితే ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. తాజాగా ఓ చర్చా కార్యక్రమంలో పాలొన్న రాధికా తాను దర్శకురాలిగా మారడంపై స్పందించారు. ఆమె మాట్లాడుతూ ‘నేను ఎప్పుడూ దర్శకురాలిగా మారాలని అనుకోలేదు. అసలు అలాంటి ఆలోచనే రాలేదు. నాకు ఆసక్తికరంగా అన్పించింది, తోచింది రాయాలనుకున్నాను. నేను హనీ ట్రెహాన్, అభిషేక్ చౌబేలకు కథను చెప్పినప్పుడు వారు దాన్ని చేయాలనుకున్నారు. షూటింగ్ కు, ప్రిపేరేషన్ కు 10 రోజులు ఉందనగా కథ రాయడం అయిపోయింది. కథ రాయడం అయిపోయాక అందులో నేను నటించాలని అనుకోలేదు. కానీ దర్శకత్వం వహించాలనుకున్నా. దర్శకత్వం చేయడం నాకు బాగా నచ్చింది’ అంటూ తెలిపింది. కాగా రాధిక చివరిసారిగా ‘ఓకె కంప్యూటర్’ అనే వెబ్ సిరీస్ లో కనిపించిన విషయం తెలిసిందే. అందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి కూడా.