డేరాబాబాకు కరోనా పాజిటివ్……
సంచలన వివాదాస్పద బాబా… డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్.. కరోనాబారినపడ్డారు. డేరాబాబాగా గుర్తుంపు పొందిన ఈయన తన ఆశ్రమంలోని ఇద్దరు సాధ్వినులపై అత్యాచారం చేసిన కేసులో హర్యానాలో 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే తాజాగా ఆదివారం ఆయనకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా..ఈరోజు వచ్చిన రిపోర్ట్లో పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
అదేవిధంగా కడుపులో నొప్పిగా ఉండడంతో.. రోహ్తక్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డేరాబాబాకు (పీజీఐఎంఎస్)లో పరీక్షలు చేయించారు. ఆ తర్వాత గురుగ్రామ్లోని మెదంత ఆసుపత్రికి తరలించారు జైలు అధికారులు. అయితే అక్కడ నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్గా తేలింగి. దీంతో.. ఆయనకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్వయం ప్రకటిత దేవుడుగా సంచలనం రేపిన ఈ డేరా బాబా.. ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసినందుకు 2017 ఆగస్టులో 20 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది కోర్టు. కాగా 16 సంవత్సరాల క్రితం ఒక జర్నలిస్టును హత్య చేసిన కేసులో 2019 జనవరిలో పంచకుల ప్రత్యేక సిబిఐ కోర్టు అతనికి, మరో ముగ్గురికి జీవిత ఖైదు విధించిన విషయం కూడా విదితమే.