డేరాబాబాకు అస్వస్థత… చికిత్స తర్వాత తిరిగి జైలుకు…
గతంలో డేరాబాబా వేధింపుల వ్యవహారం సంచలనంగా మారి జైల్లో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే తన ఆశ్రమంలోని ఇద్దరు సాధ్విలపై అత్యాచారానికి పాల్పడినట్టు తేలడంతో.. రోహ్తక్లోని సునేరియా జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు డేరా సచ్చా సౌధ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్. అయితే డేరాబాబా తాజాగా మరోసారి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. తన కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో.. జైలు అధికారులు డేరా బాబాను ఉదయం 7 గంటల సమయంలో రోహ్తక్లోని పీజీఐఎంఎస్ ఆస్పత్రికి భారీ పోలీసు భద్రత మధ్య తరలించినట్లు తెలుస్తోంది.
అదేవిధంగా ఆస్పత్రిలో వైద్యులు డేరా బాబాకు వివిధ పరీక్షలు నిర్వహించిన తర్వాత.. తిరిగి ఆయనను జైలుకు తరలించారు. అలాగే డేరా బాబా ఆస్పత్రిలో చేరడం ఇది తొలిసారి కాదు.. మే 12వ తేదీన కూడా తనకు బాగాలేదని చెప్పడం, బీపీ హెచ్చుతగ్గులతో పీజీఐఎంఎస్ ఆస్పత్రిలో అధికారులు చేర్పించి చికిత్స అందించారు. కాగా ఏడుగురు డాక్టర్ల బృందం ఆయనకు చికిత్స అందించి.. ఒకరోజు ఆస్పత్రిలో ఉన్న ఆయనకు అదనపు భద్రత ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రోజు తిరిగి జైలుకు తరలించారు. అదేవిధంగా ఇప్పుడు మరోసారి డేరాబాబా అస్వస్థకు గురయ్యారు. తాజాగా షుగర్, బీపీతో బాధపడుతున్న డేరాబాబా రెగ్యులర్గా మందులు కూడా తీసుకుంటున్నారని చెప్తున్నారు. కాగా సాధ్విలను అత్యాచారం చేసిన కేసులో.. ఆయనకు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.