టెన్త్ పరీక్షలు రద్దు చేసే ప్రసక్తే లేదు : మంత్రి సురేష్
ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పరీక్షలు జరిపితీరుతామని అంటుంది ప్రభుత్వం. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమండ్రిలో మొక్కలు నాటారు రాష్ట్ర విద్య శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కరోనా సమయంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రద్దు చేసే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు.
అదేవిధంగా అనుకూల పరిస్థితుల తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని, పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలనే ప్రతిపక్ష పార్టీల డిమాండ్ సరికాదని అన్నారు. అలాగే లోకేష్ చదువుకోవడానికి ఆ రోజుల్లో సత్యం కంప్యూటర్స్ సంస్థ ఉందని.. పేద విద్యార్దులకు అటువంటి సహాకారం లేదని అన్నారు. అంతేకాకుండా పదవ తరగతే ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు ప్రమాణమని, పరీక్షలు ఇప్పటికిప్పుడు నిర్వహిస్తామనడం లేదని కూడా వివరించారు. కాగా ప్రతి పక్షాలు అనవసరంగా ఈ విషయంపై రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు.