టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా దేత్తడి హారిక
తెలంగాణ యాసలో యూట్యూబ్ చానల్ ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైంది హారిక. ‘దేత్తడి’ వెబ్ సిరీస్తో హారికకు విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. ముఖ్యంగా హారిక తెలంగాణ యాసతో అదరగొడుతూ అనతి కాలంలోనే అత్యంత పాపులారిటీని సంపాదించుకుంది.
అయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గోన్న హారిక మరింత పాపులర్ అయ్యిందనే చెప్పాలి. బిగ్ బాస్ తో హారిక తక్కువ సమయంలోనే మంచి ఆటతీరుతో ప్రేక్షకులు గుర్తించే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం హారిక సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా ‘దేత్తడి హారిక’ కు మరో గుర్తింపు లభించింది. తెలంగాణ రాష్ట్ర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా హారిక ఎంపిక కావడంతో ఎంతో ఆనందంతో గంతులు వేసింది హారిక. మహిళా దినోత్సవం సందర్బంగా హారికను తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.