టీవీ ప్రోగ్రామ్ షూట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్…!
టాలీవుడు యంగ్ టైగర్ ఎన్టీయార్ ఎట్టకేలకు నాలుగు సంవత్సరాల తర్వాత తన సెకండ్ టీవీ షోకు శ్రీకారం చుట్టాడు. 2017లో ‘బిగ్ బాస్’ సీజన్ ఒన్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన జూ. ఎన్టీయార్ ఇప్పుడు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం చేస్తున్నాడు. అందుకు సంబంధించిన ప్రోమోలో ఇప్పటికే నటించిన ఎన్టీయార్, శనివారం అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్ లో షూటింగ్ కు హాజరయ్యాడు.
అయితే ఈ నెల 20 వరకూ ఇందుకు సంబంధించిన చిత్రీకరణ జరుగనున్నట్లు తెలుస్తోంది. జెమినీ టీవీ ఛానెల్ లో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం ప్రసారం కానుంది. అతి త్వరలోనే దీనికి సంబంధించిన ఎన్టీయార్ ప్రోమోనూ టెలికాస్ట్ చేస్తారని కూడా తెలుస్తోంది. అలాగే… రాజమౌళి మేగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’లో ఎన్టీయార్ పై ఓ పాటను చిత్రీకరించాల్సి ఉంది. ఈ షూటింగ్ వచ్చే నెలలో ఉక్రేయిన్ తో షూట్ చేయబోతున్నట్లు సమచారం. ఆ తర్వాత ఎన్టీయార్… డైరెక్టర్ కొరటాల శివతో మూవీ చేయనున్నారు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న రెండో సినిమా ఇది కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పటికే ఫుల్ ఖుషీలో ఉన్నారు.