టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్…
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేతలు వరుస అరెస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను ఈరోజు తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లాలోని చింతలపూడిలో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే ముందస్తు సమాచారం లేకుండానే ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి వాహనంలో తీసుకెళ్లడంతో జిల్లాలో గందరగోళం నెలకొంది. జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. రాజధాని భూముల విషయంలో ఆయన్ను అదుపులోకి తీసుకొని ఉండ వచ్చనే ప్రచారం జరుగుతుంది. కానీ సంగం డైరీ విషయంలో చోటు చేసుకున్న అవకతవకలు మూలంగా నరేంద్రను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా పోలీసులు అరెస్ట్ చేసి ఆయన్ను విజయవాడకు తరలిస్తున్నట్లు సమాచారం అందుతుంది. కాగా దూళిపాళ్ల అరెస్ట్ ను టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. దూళిపాళ్ల అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా వ్యతిరేకించారు. ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడం పట్ల పార్టీలో పలువురు నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.