టీడీపీ ఎంపీకి స్పీకర్ కుమారుడు ఓ సవాల్…
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ, అధికార వైసీపీపై పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తాజాగా ఎంపీ రామ్మోహన్ నాయుడికి తమ్మినేని సీతారాం కుమారుడు రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్ కౌంటర్ ఇచ్చారు. వ్యాక్సిన్, కరోనా చికిత్సపై ఎంపీ రామ్మోహన్ నాయుడు అవాస్తవాలు మాట్లాడుతున్నారని.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని చురకలు అంటించారు.
అదేవిధంగా దేశంలో ఏ రాష్ట్రం బయటి దేశాల నుంచి వ్యాక్సిన్ తెచ్చుకోవడం లేదని.. అలాంటి పరిస్థితులు ఉంటే నిరూపించాలని రామ్మోహన్ నాయకుడికి సవాల్ విసిరారు. అలాగే మీ నాయకుడు చంద్రబాబు.. హైదరాబాద్ లో కూర్చుని జూమ్ మీటింగ్ లో మాట్లాడతారని.. మీరు సోషల్ మీడియాలో మాట్లాడతారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో కూర్చుని ఫేస్ బుక్ లో మాట్లాడటం కాదని.. దమ్ముంటే శ్రీకాకుళం రా అని సవాల్ విసిరారు. పీపీఈ కిట్లు వేసుకుని రిమ్స్ హాస్పిటల్ కు వెళదామని.. వైద్యం సక్రమంగా అందుతుందో లేదో చూద్దామని మండిపడ్డారు. కాగా వైద్యం సక్రమంగా అందుతుంటే మీరు చేసిన వ్యాఖ్యలు తప్పని ఒప్పుకుంటారా ? అని ఆయన ప్రశ్నించారు.