టీటీడీ కీలక నిర్ణయం.. ఆనందంలో రమణ దీక్షితులు
ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా టీటీడీ దేవస్థానం బోర్డు సంచలనం రేపేలా కీలక నిర్ణయం తీసుకోవడం చర్చకు దారితీస్తుంది. అదేమంటే.. రిటైర్డ్ అయిన అర్చకులను విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది టీటీడీ.
కాగా గతంలో రిటైర్డ్ అయిన ప్రధాన అర్చకులతో పాటుగా మిగతా అర్చకులు కూడా ఈ నిర్ణయంతో విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది దేవస్థానం బోర్డ్. 38118/2018 హైకోర్టు తీర్పు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ వెల్లడించింది. అయితే టీటీడీ నిర్ణయంతో గతంలో రిటైర్డ్ అయ్యిన రమణ దీక్షితులు తిరిగి ప్రధాన అర్చకుల హోదాలో ఆలయప్రవేశం చేయనున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఆలయ ప్రధాన అర్చకులు ఆ పోస్ట్ లోనే కొనసాగుతారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. టీటీడీ నిర్ణయం పట్ల మాజీ అర్చకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తుండటం విశేషం.