టీఆర్ఎస్ ఓ దండుపాళ్యం బ్యాచ్.. బండి సంజయ్ హాట్ కామెంట్స్

తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయంటే చాలు టీఆర్ఎస్- బీజేపీ మధ్య పచ్చగడ్డివేస్తే బగ్గుమనేలా మాటల తూటాలు పేలుతుంటాయి. తాజాగా బీజేపీ తెలంగాణ అద్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఓ దండుపాళ్యం బ్యాచ్ అంటూ హాట్ కామెంట్లు గుప్పించారు.
ముఖ్యంగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి రవి కుమార్ నాయక్ ను గెలిపించాలని కోరుతూ గుర్రంపుడు మండలం కొప్పోలులో రోడ్డుషోలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కోతల రాయుడు సీఎం కేసీఆర్- సాగర్ కు వస్తున్నాడు, కుర్చీ వేసుకుని కూర్చొని ఎస్ఎల్బీసీ పూర్తిచేస్తా అన్నాడు. ఇప్పటి వరకు పూర్తి చేయలేదని ఆయన మండిపడ్డారు. అదేవిధంగా టీఆర్ఎస్ దొంగలు వచ్చారు.. దగుల్ బాజిగాళ్లు వచ్చారు.. మద్యం డబ్బుతో మాయమాటలతో మోసం చేసేందుకు వచ్చారు.. అని ప్రజలకు బండి సంజయ్ హెచ్చరికలు టీఆర్ఎస్ ను ఏకిపాడేశారు. టీఆర్ఎస్కు ఎందుకు సాగర్ లో ఓటు వేయాలని ప్రశ్నించిన బండి సంజయ్.. అన్ని కేంద్రం ఇస్తే కేసీఆర్ ఏమి పీకుతాడు అంటూ వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా కేంద్రం ఇచ్చిన నిధులు లెక్కలు అన్ని తీసుకొని వచ్చానని.. రేషన్ బియ్యానికి 29 రూపాయలు కేంద్రం ఇస్తుందని.. రాష్ట్రం ఒక్క రూపాయి ఇస్తుందని అన్నారు. ఇంకా కేంద్ర పథకాలకు రాష్ట్ర పథకాలుగా చెప్పుకుంటూ కేసీఆర్ ఫొటోలు పెట్టుకుంటున్నారని బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. అసలు నల్గొండ జిల్లాకు సీఎం కేసీఆర్ ఏమి చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాకు వివిధ పథకాల కింద 1683 కోట్లు ఇచ్చామని తెలిపిన ఆయన ప్రతి పైసా కేంద్రం ఇస్తుందని.. కానీ.. కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వడం లేదని సీఎం కేసీఆర్ చెప్తుండటం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *