టీఆర్ఎస్ ఎంపీ నామాకు షాక్… ఈడీ సమన్లు…

తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాకిచ్చింది. తాజాగా ఈరోజు ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే సమన్లలో భాగంగా ఈనెల 25వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది.
అయితే బ్యాంకు రుణాలను మళ్లించిన కేసుకు సంబంధించి ఈడీ.. ఎంపీ నామా నాగేశ్వరరావుకు సమన్లు జారీ చేసింది. అదేవిధంగా మధుకాన్ కేసులో నిందితులందరికీ ఈడీ సమన్లు జారీ చేయడం విశేషం. కాగా మధుకాన్ గ్రూప్ డైరెక్టర్ల ఇళ్లల్లో ఈమధ్య ఈడీ వరుస సోదాలు జరిపిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో భాగంగా హార్డ్డిస్క్లు, డాక్యుమెంట్లు, రూ.లక్షల నగదు స్వాధీనం చేసుకోవడం తెలిసిందే.