టాలీవుడ్ లోకి కోలీవుడ్ హీరో ధనుష్ ఎంట్రీ…!

కోలీవుడ్ స్టార్ హీరోలు అయిన సూర్య, కార్తీ ఇప్పటికే స్ట్రయిట్ తెలుగు సినిమాలలో నటించి మెప్పించారు. దీంతో ఆ హీరోలకు తెలుగులో కూడా ప్యాన్ బాగా ఉంది. అలాగే విజయ్ ఆంటోని కూడా తెలుగులో తన సినిమాలకు లభిస్తున్న ఆదరణను బట్టి స్ట్రయిట్ తెలుగు సినిమాలో తప్పకుండా నటిస్తానని చెప్తున్నాడు. అయితే ఈ మధ్య విజయ్ తో తెలుగు సినిమా తీయబోతున్నట్టు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రకటించారు కూడాను.
అదేవిధంగా తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా తెలుగు సినిమాలో నటించడానికి పచ్చజెండా ఊపినట్టు సమాచారం అందుతుంది. నిజానికి చాలా కాలం తమిళ సినిమాలకే పరిమితం అయిన ధనుష్ ఆ మధ్య హిందీ సినీ రంగ ప్రవేశం కూడా చేశాడు. ఆ తర్వాత ఓ ఇంగ్లీష్ సినిమాలో కూడా నటించాడు. ఇప్పుడు ఓ అమెరికన్ మూవీలో కూడా నటిస్తున్నాడు. అలాగే తాజాగా ధనుష్ దక్షిణాది భాషల్లో తమిళం తర్వాత నటిస్తున్నది తెలుగులోనే అని చెప్పాలి. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ, ఓ పాపులర్ దర్శకుడితో ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం అందుతుంది. కాగా రెండు మూడు భాషల్లో నిర్మితం కానున్న ఈ మూవీలో ఓ సీనియర్ హీరో కూడా నటించబోతున్నారని సమాచారం. కాగా తెలుగులో కూడా ఈ మధ్య ధనుష్ నటించిన సినిమాలకు ఆదరణ లభిస్తుండటం విశేషం. వరల్డ్ వైడ్ అతనికి విశేషంగా అభిమానులు ఉండటంతో సహజంగానే ఈ ప్రాజెక్ట్ కు క్రేజ్ వచ్చే అవకాసం ఉంది. మరి ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *