టాలీవుడ్ ప్రముఖులకు బుట్టబొమ్మ మామిడి పండ్లు పంపిణీ….

దేశంలో కరోనా చాలా తీవ్రంగా విజృంభిస్తుంది. ఇలాంటి సమయంలో పూజా హెగ్డే వినూత్న కార్యక్రమానికి పూనుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ లోని టాప్ సెలెబ్రిటీలందరికీ ఓ సర్ప్రైజ్ ఇవ్వబోతుంది. ఇప్పటికే కరోనాతో సినిమా షూటింగ్ లు అన్నీ ఆగిపోయాయి. తీరిక వేళ ఏదో ఒకటి చేసి ఆకర్షించాలని ఈ బుట్టబొమ్మ తాపత్రయ పడుతుంది. దీంతో ఈ బ్యూటీ తన సొంతూరు అయిన మంగుళూరుకు వెళ్లిందట. ఈ ఊరులో పూజాహెగ్డేకు పెద్ద మామిడి తోట ఉంది. ఆ తోటలో ఈ సంవత్సరం మామిడి పండ్ల దిగుబడి చాలా ఎక్కువగా వచ్చిందని తెలుస్తోంది. ఇంకేముంది… పూజా సొంత తోటలో పండిన మామిడి పండ్లను టాలీవుడ్లోని తన అభిమాన దర్శకులు, నిర్మాతలు, నటీనటులకు పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది.
అందులో భాగంగా ఈ మధ్యనే పూజా తన మొదటి ప్యాక్ ను త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు మరికొంతమంది నిర్మాతలకు పంపింది. ఇక ఈరోజు నుంచే ఆమె తన జాబితాలోని దర్శకులు, హీరోలు, నిర్మాతలందరికీ మామిడి పండ్ల ప్యాక్లు పంపిణి చేస్తుందని తెలుస్తోంది. వీరిలో హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్, యువి ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్ నిర్మాతలు తమ ప్యాక్లను త్వరలోనే అందుకోనున్నారన్నమాట. కాగా డిజె, అరవింద సమేత, ముకుంద, ఒక లైలా కోసం, అలా వైకుంఠపురంలో వంటి సినిమాలతో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న పూజాహెగ్డే… ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘రాధేశ్యామ్’ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.
Type a message