జోరు మీదున్న రష్మిక.. ఆఫర్లను భలే పట్టేస్తుందిగా…

టాలీవుడ్ లో అనతి కాలంలోనే అత్యంత ఆదరణపొంది లక్కీ గర్ల్ గా మారిన రష్మిక మందన ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’లో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే పలు బాలీవుడ్ ప్రాజెక్టులతో కూడా బిజీ అయిపోయింది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ‘మిషన్ మజ్ను’ చిత్రంలో నటిస్తున్న రష్మిక.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్తో ‘గుడ్ బాయ్’ అనే సినిమాలో కూడా నటిస్తోంది.
అదేవిధంగా రామ్ చరణ్-శంకర్ సినిమాలో ఇప్పటికే రష్మిక ఛాన్స్ ను కొట్టేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె జర్నలిస్టు గా కనిపించనుందనే టాక్ వినిపిస్తుంది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నారనే ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. కాగా చరణ్ కు మీడియా సపోర్టర్ గా రష్మిక పాత్ర కీలకంగా ఉండనుందనే వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇది అలా ఉంచితే తాజాగా రష్మిక మరో బంపర్ ఆఫర్ కొట్టేసిందట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. అదేమంటే ఇప్పటికే రెండు బాలీవుడ్ సినిమాలు చేస్తున్న రష్మిక.. తాజాగా మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట. తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో పాల్గొన్న ఆమె ఈ విషయంపై స్పందించారు. ‘ఇప్పుడు రెండు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నాను. త్వరలోనే మూడో సినిమా అంగీకరించబోతున్నాను’ అని రష్మిక స్పష్టం చేయడం విశేషం. మొత్తం రష్మిక ఫ్యాన్స్ ఈ విషయం తెలియగానే బ్యూటీ మంచి జోరుమీద ఉందిగా అంటూ కామెంట్స్ గుప్పిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *