జైల్లో కరణ్ మెహ్రా… తనపై టార్చర్ నిజమే… భార్య నిషా రావల్..

హిందీలో ‘యే రిష్తా క్యా కెహ్లాతాహై’ అనే హిట్ సీరియల్ నటుడు కరణ్ మెహ్రా ప్రస్తుతం చాలా తీవ్రమైన వ్యక్తిగత ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. అతడి భార్య నిషా రావల్ గృహ హింస ఆరోపణలు చేస్తూ కేసు పెట్టడంతో కరణ్ మెహ్రాని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. నిషా చెబుతోన్నట్టు తాను ఆమెని గోడకేసి కొట్టి గాయపరచలేదని కరణ్ వెల్లడించారు. తనే పలు మార్లు గోడకు తలను బాదుకుందని ఆయన అంటున్నారు. అంతేకాకుండా ఆమెకు ‘బైపోలార్ డిజార్డర్’ ఉంది అని కూడా చెప్పారు.
అదేవిధంగా ఈ విషయంపై స్పందించిన నిషా రావల్ తనకు ‘బైపోలార్ డిజార్డర్’ నిజమేనని అన్నారు. అది తనకు 2014లో ఉండేదని తెలిపారు. అప్పట్లో ప్రెగ్నెంట్ గా ఉన్న తనకు అబార్షన్ జరగటంతో మానసికంగా క్రుంగిపోయానని, అందుకే ఆ తీవ్రమైన బాధ కారణంగా బైపోలార్ డిజార్డర్ వచ్చిందని అన్నారు. బైపోలార్ డిజార్డర్ అంటే మానసిక ఒత్తిడి కారణంగా ఏర్పడే మూడ్ డిజార్డర్. అది ఉన్న వారు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో చెప్పలేమని కూడా తెలుస్తోంది. కాగా తనకు మానసిక సమస్యలు ఉండేవని చెప్తూనే కరణ్ మెహ్రా భార్య మరిన్ని ఆరోపణలు చేసింది. అవేమంటే… అసలు తన భర్త ఎప్పుడూ తన పట్ల మంచిగా ప్రవర్తించలేదని అన్నారు. తాను మిస్ క్యారేజ్ వల్ల తీవ్రమైన డిప్రెషన్ లో ఉంటే కరణ్ కొట్టేవాడనీ, థెరపిస్టు వద్దకి ట్రీట్మెంట్ కి కూడా వెళ్లనిచ్చేవాడు కాదనీ, చాలా దారుణంగా బెదిరించే వాడని కూడా నిషా రావల్ వెల్లడించింది. కాగా మే 31వ తేదీన తమ మధ్య జరిగిన గొడవ గురించి చెప్తూ… తనని కరణ్ గోడకు అదిమి గాయపరిచాడని, గొంతు నులిమేశాడని కూడా షాకింగ్ కామెంట్స్ వెల్లడించారు. మరి ఇలాంటి సమయంలో కరణ్ మెహ్రా, నిషా రావల్ మధ్య కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో కోర్టులకే తెలియాలి మరి.