ఛత్రీవాలా గా రకుల్ ప్రీత్ సింగ్…..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ ఇప్పుడు బాలీవుడ్ లో తెగ సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం హిందీ సినిమాలో కండోమ్ టెస్టర్ పాత్రను పోషిస్తోంది. ఈ సోషల్ కామెడీ మూవీని రూనీ స్క్రూవాల ఆర్ఎస్వీపీ బ్యానర్ లో నిర్మిస్తుడటం విశేషం. అలాగే మరాఠీ దర్శకుడు, ‘బకెట్ లిస్ట్’ ఫేమ్ తేజస్ విజయ్ డియోస్కర్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే దాదాపు ఆరేడు హిందీ సినిమాల్లో గ్లామర్ డాల్ గా నటించిన రకుల్ ప్రీత్ యాక్ట్ చేస్తున్న ఫస్ట్ ఉమెన్ సెంట్రిక్ మూవీ ఇదే కావడం కూడా విశేషమే అని చెప్పవచ్చు.
అయితే ఈ సినిమాకు ‘ఛత్రీవాలీ’ అనే పేరును ఖరారు చేసినట్టు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఉత్తరాదిని కండోమ్ ను ఛత్రీ అని ఊరుజనం పిలుస్తుంటారు. రకుల్ పోషిస్తోంది కండోమ్ టెస్టర్ పాత్ర కావడంతో ఛత్రీవాలీ అనే పేరు కరెక్ట్ గా ఉంటుందని మేకర్స్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా రకుల్ ప్రీత్ సింగ్ కంటే ముందు ఈ స్టోరీని డైరెక్టర్ తేజస్ విజయ్… సారా అలీఖాన్ కు, అనన్యపాండేకు వినిపించారని తెలుస్తోంది. ఆ సమయంలో వాళ్ళిద్దరూ ఈ ప్రాజెక్ట్ ను తిరస్కరించారని కూడా టాక్. మరి ఈ స్టోరీని విన్న వెంటనే నటించనని సారా చెప్తే… కాన్సెప్ట్ తో పాటు హీరోయిన్ పాత్ర మరీ బోల్డ్ గా ఉందని అనన్య పాండే ఒప్పుకోలేదట. మొత్తానికి రాకరాక ఉమెన్ సెంట్రిక్ పాత్ర లభించడంతో రకుల్ వెంటనే ఒప్పేసుకుందని టాక్. అలాగే ‘సర్దార్ అండ్ గ్రాండ్ సన్’ మూవీతో రకుల్ ప్రీత్ సింగ్ డిజిటల్ ఎంట్రీ ఇవ్వనుంది. అసలు ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కోసం తీసినప్పటికీ… ప్రస్తుతమున్న పరిస్థితులు బాగలేకపోవడంతో నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ‘ఛత్రీవాలీ’ సినిమాను మాత్రం కేవలం ఓటీటీని దృష్టిలో పెట్టుకొనే తీస్తున్నారని తెలుస్తోంది. కాగా ఈ బోల్డ్ సబ్జెక్ట్ లో కుర్రకారు ఇష్టపడే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని, మరి ఈ బోల్డ్ కంటెంట్ ను కూడా హ్యూమరస్ గానే తెరకెక్కిస్తామని దర్శకుడు తేజస్ విజయ్ చెప్పడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *