ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ వెనుక ఘోరాలు..

ఛత్తీస్ గఢ్ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉండటం ఆందోళనకు గురి చేస్తుంది. బీజాపూర్ అటవీప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ జరుగుతూనే ఉంది. పదుల సంఖ్యలో జవాన్లు నేలకొరిగారు. అయితే ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించి కొన్ని కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.
ముఖ్యంగా జవాన్ల పట్ల నక్సలైట్లు చాలా క్రూరంగా వ్యవహరించినట్లు సమాచారం. ప్రాణాలతో పట్టుబడిన జవాన్లను.. నక్సలైట్లు చిత్రహింసలు పెట్టి హత్య చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అలాహగే మృతిచెందిన జవాన్ల వద్ద లభించిన ఆయుధాలు, తుపాకులు, బులెట్ ప్రూఫ్ జాకెట్లు, బూట్లతో నక్సల్స్ పరారైనట్టు కూడా తెలుస్తోంది. బులెట్ దెబ్బలు తగిలి కదల్లేని స్థితిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ జవాను పట్ల… నక్సల్స్ పాశవికంగా వ్యవహరించినట్టు కూడా అధికారులు వెల్లడించారు. అతని చేయి నరికి హత్య చేసినట్లు చెప్పారు. బుల్లెట్ గాయాలు తగిలినవారిలో కొందరు సైనికులు బతికే అవకాశం ఉన్నా… గంటల తరబడి ఎదురుకాల్పులు జరగడంతో తిండి, నీరు లేక డీహైడ్రేషన్కు లోనై ప్రాణాలు విడిచినట్టు అధికారు చెప్పారు.
అంతేకాకుండా ఎండలు మండుతుండటం, తినడానికి తిండి కూడా లేకపోవడం, తాగడానికి నీరు దొరక్కపోవడం నోరు పిడచకట్టుకుపోయి.. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఎంతోమంది జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. కాగా కళ్లముందే సహచరులు ప్రాణాలతో కొట్టుకుంటున్నా.. వారిని రక్షించలేని నిస్సహాయస్థితిలో జవాన్లు కొట్టుమిట్టాడినట్లు కూడా సమాచారం. ఇంతటి భారీ ఎన్కౌంటర్లో… గల్లంతైన వారికోసం, అమరుల మృతదేహాల కోసం ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. చత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ లో 24 మంది జవాన్లు మృతి చెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *