చంద్రబాబు డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ డ్రామా

ఆంధ్రప్రదేశ్ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చేష్టల వెనుక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్రెడ్డి తెలిపారు. తాజాగా వైసీపీ ఎంపీలు అంతా తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. బాబు డైరెక్షన్లోనే రఘురామ పని చేస్తున్నారని, బెయిల్ రాకపోవడంతోనే కొత్త డ్రామాలకు తెరతీశారని అన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మిథున్ రెడ్డి మండిపడ్డారు. అసలు రఘురామరాజు ఏం లేకుండానే ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని కుటుంబసభ్యులను కూడా పావులుగా వాడుకుంటున్నాని తెలిపారు. ప్రాణహాని ఉందంటూ కేసును డైవర్డ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు వైసీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదేవిధంగా టీడీపీ నేతలు అరెస్టైనప్పుడు కూడా ఇంత హడావిడి చేయని చంద్రబాబు.. ఇప్పుడు మాత్రం చాలా తీవ్రమైన బాధను వ్యక్తం చేస్తున్నారని అన్నారు. పోలీసులు కొట్టలేదని వైద్య బృందమే కోర్టుకు నివేదిక ఇచ్చిందని… కేవలం రమేష్ ఆస్పత్రిలోనే ట్రీట్మెంట్ జరగాలనడం సరికాదని మిథున్ రెడ్డి వివరించారు.
అంతేకాకుండా ఎంపీ కాకముందే రఘురామకృష్ణరాజు ఐదుసార్లు పార్టీ మారారని ఎంపీ బాలశౌరి అన్నారు. పార్టీలో రఘురామకృష్ణరాజుకు సముచితస్థానం ఇచ్చామని, అయినప్పటికీ సీఎం, మంత్రులపై లేనిపోని ఆరోపణలు చేశారని ఆరోపించారు. అలాగే కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేశారని, పోలీసులు కొట్టారనడం పెద్ద డ్రామా అని తేలిపోయిందని అన్నారు.
కాగా ఘురామకృష్ణరాజు తీరుపై మరో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మండిపడ్డారు. టీడీపీ స్క్రిప్ట్ను రఘురామకృష్ణరాజుతో చదివిస్తున్నారని అన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే యత్నం చేస్తున్నారని, చంద్రబాబు చెప్పిందే రఘురామకృష్ణరాజు చేస్తున్నారని ఆయన వివరించారు. అసలు ఆయనకు ట్రీట్మెంట్ కోసం రమేష్ ఆస్పత్రికే ఎందుకు తీసుకెళ్లాలని, ఈ కేసులో ప్రభుత్వం చట్టప్రకారమే వ్యవహరిస్తోందని శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *