చంద్రబాబుకు ఆ శాపమేదో ఉంది: విజయసాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి మండిపడ్డారు. ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న ఈ తరుణంలో ప్రభుత్వంపై టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తున్నదని విరుచుకుపడ్డారు. ఎక్కడ కరోనా మరణ వార్త వినిపిస్తుందా అని బాబు కనిపెట్టుకుని కూర్చుంటాడని… రాత్రి పూట నిద్ర పట్టని శాపం ఏదో ఉన్నట్టుందని విజయసాయి ఎద్దవా చేశారు.
అసలికి ఆయన ఏమన్నారంటే… ‘కరోనా మహమ్మారి ప్రపంచ యుద్ధాల కంటే దారుణమైనది. పాకిస్తాన్, చైనాతో మనం జరిపిన పోరాటాల కంటే పెద్దది. ఆపత్కాలాల్లో ప్రజలను కాపడుకోవడానికి విభేదాలు మరిచి ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలతో సహకరించడం చూశాం. ఎల్లో గ్యాంగు నుంచి అంత గొప్ప ఆలోచనను ఆశించలేం. కొన్ని బతుకులంతే. ఎక్కడ కరోనా మరణం వార్త కనిపిస్తుందా అని బాబు కనిపెట్టుకుని కూర్చుంటాడు. రాత్రి పూట నిద్ర పట్టని శాపం ఏదో ఉన్నట్టుంది. ఉన్న పనల్లా ఇదే. నాలుగు రోజుల పాటు అంతా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తే ఏ అర్థరాత్రో తనే ఆక్సిజన్ పైపులను కోసినా కోసొచ్చే నికృష్టుడు’ అంటూ విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి తాజాగా తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో జరిగిన ఘటనపై టీడీపీ చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. ఆ హడావుడిని ఉద్ధేశించే విజయసాయిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చంద్రబాబుపై గుప్పించినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *