గుంటూరు ప్రజలకు సిగ్గులేదు అంటూ బాబు ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజు సందర్భంగా చంద్రాబాబు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఓ దశలో గుంటూరు ప్రజలకు సిగ్గు, బుద్ధి లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతి పనులు ఆపడంతో వేలాది మంది పనులు కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లారని ఆయన ఆవేశంలో ఊగిపోయారు. అయితే ఓటేయకపోతే సంక్షేమ పథకాలు కట్ చేస్తామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు.
అదేవిధగా వైసీపీ నేతలకు సిగ్గుందా? బుద్ది ఉందా?.. మీకు ఓట్లేయకపోతే బెదిరిస్తారా? అని ప్రశ్నించారు. అమరావతి మహిళలు దుర్గమ్మ గుడికి వెళ్తే కొడతారా?… మహిళా దినోత్సవం రోజున జగన్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చే మర్యాద ఇదేనా? అని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెడతారో పెట్టండి చూస్తా అంటూ ఆవేశంతో ఊగిపోయారు చంద్రబాబు నాయుడు. గుంటూరు ప్రజలకు సిగ్గుంటే వైసీపీ జెండా పట్టుకోరని, గుంటూరు ప్రజలకు రోషం, పౌరుష లేదని, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు బ్రతికున్న చచ్చినట్లే లెక్క అని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అంతేకాకుండా ఇక్కడ ప్రజలు హైదరాబాద్ పాచీ పని చేయడానికి వెళ్తున్నారు, అలాంటి వారికి ఇక్కడే ఉపాది కల్పించాలని రాజధాని తెచ్చానని బాబు అన్నారు. ప్రజల అసమర్దత వల్లే జగన్ మళ్లీ ఓటు అడుగుతున్నాడని, వంట గ్యాస్, పెట్రోల్ ధరలు పెరిగినా మహిళలకు కోపం రావడం రాదని, కరెంట్ తీగ పట్టుకోవద్దని తాను చెప్పినా ప్రజలు విన లేదని ఆయన అన్నారు.