‘గని’ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్…

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం తన స్పోర్ట్స్ డ్రామా ‘గని’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో మెగా హీరో అయిన వరుణ్ తేజ్ ను ఆయన బాక్సింగ్ డ్రామా ‘గని’ సెట్లో కన్పించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ వార్తను అల్లు అర్జున్ అన్నయ్య అల్లు వెంకటేష్ (బాబీ) తన ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. సెట్స్ నుండి ఒక పిక్ ను షేర్ చేస్తూ ‘గని (వరుణ్ తేజ్) బాక్సింగ్ నైపుణ్యాలు, ట్రాన్స్ఫర్మేషన్ గురించి మనందరికీ ఆసక్తి ఉంది’ అంటూ షేర్ చేశారు. అయితే ఆ పిక్ లో అల్లు అర్జున్, బాబీ తప్ప వరుణ్ తేజ్ కనిపించలేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అల్లు కుటుంబం నుండి అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్ తర్వాత అల్లు కుటుంబం నుండి మూడవ నిర్మాత అల్లు వెంకటేష్. బాబీ అని పిలిచే బన్నీ సోదరుడు ‘గని’తో నిర్మాతగా పరిచయం కానున్నాడు. ఆ సినిమా సెట్ ను సందర్శించిన బన్నీ నిర్మాతగా తన అన్నయ్యకు సక్సెస్ రావాలని కోరుకోవడం విశేషం. అలాగే బన్నీ సినిమా యూనిట్… అక్కడి సిబ్బందితో కాసేపు ముచ్చటించారు.

అదేవిధంగా కొత్త డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా… అల్లు అరవింద్తో పాటు అల్లు వెంకటేష్, సిద్ధూ ముద్దా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ స్పోర్ట్ బేస్డ్ డ్రామాలో బాలీవుడ్ భామ సాయి మంజ్రేకర్ నటిస్తోంది. ఇది ఆమెకు మొదటి తెలుగు సినిమా. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలకపాత్రలను పోషిస్తున్నారు. కాగా ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో నెగెటివ్ పాత్ర పోషించి ప్రశంసలు పొందిన తర్వాత వరుణ్ తేజ్ తన సినీ కెరీర్లో తొలిసారి బాక్సర్గా నటించడానికి రెడీ కావడం విశేషం. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. అంతేకాకుండా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్తో కలిసి ‘పుష్ప’లో నటిస్తున్నారు. ఇందులో రష్మిక మండన్న హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *