గంగూలీ బయోపిక్ లో ఆ స్టార్ హీరో….!
కొంతకాలంగా క్రీడాకారులు, ప్రముఖ వ్యక్తుల జీవితాలపై ఎక్కువగా సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే మిల్కా సింగ్, సైనా నెహ్వాల్, మహేంద్ర సిన్ ధోని, గీతా ఫోగట్ వంటి పలువురు క్రీడాకారుల జీవితాలపై బయోపిక్స్ చేసి వెండితెరపై వెలిగింపజేశారు. తాజాగా మరో క్రీడాకారుడి బయోపిక్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. అదేమంటే… బిబిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జీవితంపై త్వరలో బయోపిక్ తెరకెక్కబోతుంది. ఈ సినిమాని హిందీలో నిర్మించబోతున్నట్టు మాజీ టీమిండియా కెప్టెన్ తెలిపారు. అయితే ఇందులో దర్శకుడు, హీరో ఎవరనే విషయాలు ఇంకా సస్పెన్స్ గానే ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ బయోపిక్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి దాదా జీవిత కథలో నటించడానికి ఓ స్టార్ హీరోను ఫిక్స్ చేశారనే టాక్ నడుస్తోంది. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ దాదా బయోపిక్ లో, ఆయన పాత్రను పోషించబోతున్నట్లు సమాచారం అందుతుంది. కానీ.. ఆ జాబితాలో మరో ఇద్దరు స్టార్ హీరోల పేర్లు కూడా ఉండటం విశేషం.
అంతేకాకుండా క్రికెట్ ప్రపంచంలో గంగూలీ అత్యంత ప్రభావవంతమైన క్రికెటర్లలో ఒకరైన విషయం తెలిసిందే. ఆయన జీవితాన్ని ఆధారం చేసుకొని సినిమా తీసేందుకు కావాల్సినంత కథ, కథనం, ఎమోషన్స్ దండిగా ఉన్నాయి. సౌరవ్ గంగూలీ తన చిన్ననాటి నుంచి భారత క్రికెట్ జట్టులో చేరడం, కెప్టెన్ కావడం, చివరికి అతను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించడం వరకు బయోపిక్ లో చూపించనున్నారు. కాగా ఈ బయోపిక్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. అయితే సంజయ్ దత్ బయోపిక్ ‘సంజు’లో రణబీర్ కపూర్ అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించిన విషయం తెలిసిందే. మరి ఇందులో రణబీర్ ఎంతవరకు మెప్పిస్తారో చూడాలి.