క్రూగర్ అంతకాలం జీవించడానికి కోడిమెదడే కారణమట…!
ప్రస్తుతం కరోనాతో ప్రపంచమంతా విలవిలలాడిపోతుంది. ఈ సమయంలో ఎవరు ఎంతకాలం జీవిస్తారు అనేదానికి అస్సలు పొంతనే లేకుండా పోతుంది. కరోనా కాలంలో మనిషి ఎంత కాలం జీవిస్తాడో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కరోనా కంటే ముందు ఎంతకాలం జీవిస్తారో చెప్పగలిగే వారు. కానీ.. కరోనా ఉన్న ఈ సమయంలో మాత్రం ఆ పరిస్థితి అస్సలు కనిపించడం లేదు.
అయితే.. క్రూగర్ అనే ఓ పెద్దాయన ఇప్పటికే వందేళ్లకు పైగా జీవించాడు. ఇప్పటికీ చాలా ఆరోగ్యంగా ఉరకలు వేసే ఉత్సాహంతో జీవిస్తూ ఉన్నాడు. అసలు ఆయన ఆరోగ్యంగా ఉండటానికి ప్రధాన కారణం కోడి మెదడు అని చెప్తున్నాడు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి కోడి మెదడును ఆహారంలో తీసుకుంటున్నానని అదే తన ఆరోగ్య రహస్యమని వెల్లడించారు డెక్స్ టర్ క్రూగర్. కాగా ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ లో జీవించే ఈ క్రూగర్ ఓ పశువుల ఫారాన్ని నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం అతని వయసు 111 ఏళ్ల 125 రోజులు. ఎలాగైనా మరో ఐదేళ్లపాటు జీవించి రికార్డ్ సృష్టించాలని కోరుకుంటున్నాడు క్రూగర్.