కోల్ కత్తాలో భారీ అగ్నిప్రమాదం… 7గురు మృతి
కోల్కతాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. అయితే ఆ మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ ప్రమాద సమయంలో లిఫ్ట్లో చిక్కుకపోయి ఐదుగురు మరణించారు. ఆ మృతుల్లో నలుగురు ఫైర్ సిబ్బంది, ఒక పోలీసు అధికారి, ఒక ఆర్.పి.ఎఫ్ సిబ్బంది ఉన్నారు.
అదేవిధంగా న్యూ కోయిలా ఘాట్ భవనం 13వ అంతస్థులో మంటలు చెలరేగాయి. ఈస్ట్రన్ రైల్వే, సౌత్ ఈస్ట్రన్ రైల్వే కార్యాలయాలకు నెలవైన ఈ భవనంలో సాయంత్రం గం.6.30 సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దాంతో రంగంలోకి 25 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలార్పాయి. ప్రమాద సమయంలో లిఫ్ట్ ఉపయోగించడంపై సందేహాలు నెలకొన్నాయి. అయితే ఈ సమయంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో లిఫ్ట్ ఆగిపోగా, దట్టమైన పొగతో ఊపరాడక అందులో చిక్కుకుపోయిన ఐదుగురు మరణించారు.
కాగా ప్రమాద స్థలానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వచ్చి సందర్శించారు. ప్రమాద స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అగ్నిప్రమాదం కారణంగా దగ్ధమైన ఐ.ఆర్.సి.టి.సి సర్వర్. ఆన్ లైన్ టికెట్ బుకింగ్పై ప్రభావం పడినట్లు తెలుస్తోంది.