కోచ్ ను మార్చడంపై పీవీ సింధు క్లారిటీ….!

టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం గెలిచిన సింధూ.. కోచ్ను మార్చడంపై తాజాగా మరోసారి స్పష్టతను ఇచ్చింది. అదేమంటే.. ఏడాదిన్నరగా పార్క్ తనకు శిక్షణ ఇస్తున్నాడనీ… భవిష్యత్తులోనూ అతని ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగిస్తాననీ సింధు తేల్చి చెప్పింది. గోపీచంద్ అకాడమీని వీడి గచ్చిబౌలి స్టేడియంలో సాధన చేయడంలో వివాదమేమీ లేదని సింధూ స్పష్టం చేసింది. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో అందుబాటులో ఉన్న స్టేడియం వసతుల్ని ఉపయోగించుకున్నానని కూడా వివరించింది.

అదేవిధంగా ఫిబ్రవరి నుంచి అక్కడే సాధన చేస్తున్నాననీ… ఆ స్టేడియంలో ఆడటం టోక్యోలో ఎంతగానో ఉపయోగపడిందని కూడా సింధు వివరించింది. టోక్యోలో కాంస్యం గెలిచాక గోపీచంద్ ఫోన్ చేయలేదనీ… కంగ్రాట్స్ అంటూ సందేశం మాత్రం పంపించారనీ చెప్పింది. కాగా తానుకూడా థాంక్స్ చెప్పాననీ సింధు వెల్లడించింది. అంతేకాకుండా టోక్యోలో తాను సాధించిన ఈ కాంస్య పతకంలో గోపీచంద్ పాత్ర లేదని చెప్పిన సింధు… ఏడాదిన్నరగా పార్క్ శిక్షణ ఇస్తున్నాడనీ… ఒలింపిక్స్ కోసం ఫిబ్రవరి నుంచి పార్క్ తో కలిసి పనిచేస్తున్నానని వివరించింది. అసలు పార్క్ పూర్తిగా తనకు మాత్రమే శిక్షణ ఇచ్చారనీ… ఈ పతకం ఘనత ఆయనకే చెందుతుందని సింధు స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *