కేరళ బీజేపీ సీఎం అభ్యర్థి పై సుబ్రహ్మణ్యస్వామి సెటైర్స్

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంది. ముఖ్యంగా కేరళలో బీజేపీ ఈసారి ఏవిధంగానైనా సరే సీట్లు పెంచుకోవాలని పాకులాడుతుంది. అందులో భాగంగా పక్కా స్కెచ్ లు వేస్తుంది.
అయితే కేరళ అసెంబ్లీకి ఏప్రిల్ 6 వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అధికార ఎల్.డి.ఎఫ్ కూటమి ప్రతిపక్షంలో ఉన్న యూ.డి.ఎఫ్ కూటమి మధ్య ప్రధాన పోరు ఉంటుంది. గత ఎన్నికల్లో బీజేపీ కేరళలో ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగా.. ఈసారి ఆ సంఖ్యను పెంచుకోవాలని చూస్తుంది.
అందులో భాగంగా బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెట్రో శ్రీధరన్ ను ఇప్పటికే ప్రకటించింది. మెట్రో శ్రీధరన్ ఈ మధ్య బీజేపీలో చేరారు. మెట్రో శ్రీధరన్ ను బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంపై ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి విమర్శలు గుప్పించారు. 89 ఏళ్ల మెట్రో శ్రీధరన్ ను సీఎం అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారని అన్నారు. రూల్స్ కు విరుద్ధంగా 75 ఏళ్ళు దాటిన వారికి పదవులు ఇవ్వరని, అలా ఇస్తే 2024లో అద్వానీ, మురళీ మనోహర్ జోషి, శాంతకుమార్ లు కూడా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేయడం సొంత పార్టీలోనే దుమారం రేపుతోంది.