కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఆసక్తకర విషయాలు
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో… ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధాన నిందితురాలు స్వప్నా సురేష్… ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒత్తిడితోనే సీఎం విజయన్ పేరు చెప్పినట్లుగా ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. అయితే విచారణ సమయంలో స్వప్నా సురేష్ను బెదిరించడంతోనే విజయన్ పేరు చెప్పిందని తెలిపారు. అయితే సదరు వ్యక్తి లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ ఇచ్చారని, అసెంబ్లీ ఎన్నికల వేళ… అమిత్ షా ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారని స్పష్టం చేశారు. ఎక్కడికెళ్లినా ప్రచారంలో సీఎం విజయన్ను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నారని, తిరువనంతపురం ఎయిర్పోర్ట్… గోల్డ్ స్మగ్లింగ్కు అడ్డాగా మారిపోయిందంటూ అమిత్ షా ఈ మధ్య తీవ్ర కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే.
అదేవిధంగా అమిత్ షా వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి విజయన్ తీవ్రంగా స్పందించారు. త్రివేండ్రం ఎయిర్పోర్ట్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందన్న విషయం కూడా తెలియదా? అంటూ ప్రశ్నించారు. గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతుంటే… కేంద్రం ఏం చేస్తుందని ఆయన నిలదీశారు. అలాంటి ఘటనలు జరుగుతుంటే అరికట్టాల్సిన బాధ్యత లేదా? అని తెలిపారు. ఇందుకు అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలా అసెంబ్లీ ఎన్నికల సమయంలో గోల్డ్ స్కామ్ కేసును ఉపయోగించుకోవాలని చూస్తోన్న బీజేపీకి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు సీఎం విజయన్.