కేటీఆర్ ఆరోగ్యం మీద మంచు లక్ష్మి ట్వీట్ పై సెటైర్స్….

దేశంలో కరోనా జనజీవనాన్ని అతలాకుతలం చేస్తుంది. ప్రపంచ దేశాలను విణికించేస్తుంది. ఈ కరోనా కారణంగా ఇప్పటికే ఎన్నో దేశాలు తీవ్రంగా కుదేలు అయ్యాయి. కరోనా ఎవ్వరినీ వదిలి పెట్టడం లేదు. రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకడం తీవ్రంగా ఇబ్బందిపెడుతున్న అంశం.
తాజాగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కు కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తాజాగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. కరోనా లక్షణాలు కాస్త తనకు ఉన్నాయని, ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తాను.. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నానని కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే కేటీఆర్ త్వరగా కోలుకోవాలని చాలామంది ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే మంచు లక్ష్మి కూడా చాల వెరైటీగా ట్వీట్ చేశారు. ‘మిత్రుడు కేటీఆర్ త్వరగా కోలుకోవాలి. ఈలోపు నా సినిమాలు అన్ని చూసెయ్యాలి’ అంటూ మంచు లక్ష్మీ ట్వీట్ చేశారు. దీంతో ఆ ట్వీట్ కాస్త వైరల్ గా మారింది. ఇంకేముంది మంచు లక్ష్మిపై కౌంటర్లు వేస్తున్నారు నెటిజన్లు. ముఖ్యంగా నీ సినిమాలు చూస్తే అందరు చనిపోతారు. దానికంటే కరోనాతో సావాసం చేయడమే చాలా ఉత్తమమైన మార్గం అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతుండటం విశేషం.