కేజీఎఫ్-2కోసం డైరెక్టర్ సరికొత్త ప్లాన్..
ప్రేక్షకులు అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ‘కేజీఎఫ్-2’. ఈ సినిమా కోసం మేకర్స్ అదిరిపోయే ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. అదేమంటే… ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా విలన్ ‘అధీరా’కు హీరోతో పాటు సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే సంజయ్ దత్ ‘అధీరా’ లుక్ సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజా అప్డేట్ ఏమిటంటే… దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘అధీరా’ కోసం స్పెషల్ ఇంట్రడక్షన్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. గతంలో ఎప్పుడూ ఓ విలన్ కోసం పరిచయం చేస్తూ సాంగ్ చేసే ధైర్యాన్ని, అంతటి సాహసాన్ని మూవీ మేకర్స్ చేసిన సందర్భంగా లేదు. ‘అధీరా’ ఎంట్రీ ఓ హై వోల్టేజ్ స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకులను విజిల్స్ వేయించేలా ఉండబోతుందని అందుకోసం సరికొత్త ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం అందుతుంది.
అదేవిధంగా కన్నడ సూపర్ హిట్ ‘కేజీఎఫ్’ కన్నడంలోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ సంచలన విజయం సాధించటంతో సీక్వెల్ ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం యష్ ‘కేజీఎఫ్’ చాప్టర్ 2 రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి అయింది. కాగా ఈ సినిమాలో సంజయ్ దత్, రవీనాటాండన్, రావు రమేష్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. విజయ్ కిరాగండూర్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తుండగా… రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి కరోనా సెకండ్ వేవ్ అడ్డం పడటంతో విడుదల వాయిదా పడింది. అయితే త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు సినీ యూనిట్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.